రాం రాం..క్రేజీ క్రేజీ..! - MicTv.in - Telugu News
mictv telugu

రాం రాం..క్రేజీ క్రేజీ..!

July 27, 2017

ఢిల్లీ క్రికెట్ సంఘానికి అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 150 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అందులో  అరుణ్ జైట్లీ పాత్ర ఉందంటూ కెజ్రీవాల్ గతంలో చేసిన వాఖ్యలకు,అరుణ్ జైట్లీ  కెజ్రీవాల్ మీద 10  కోట్ల పరువు నష్టం దావా కేసు వేసారు,అయితే  ఆ కేసు విచారణలో కేజ్రీవాల్  సరిగ్గా స్పందించనందుకు హైకోర్టు కేజ్రీవాల్ కు 10,000 రూపాయల జరిమానా వేసింది,అయితే ఈ కేసులో వాదనల సమయంలో కెజ్రీవాల్  తరపు న్యాయవాది రామ్ జెఠ్మలానీ అభ్యంతరకర పదాలు ఉపయోగించిన క్రమంలో అరుణ్ జైట్లీ మల్లీ  కెజ్రీవాల్ మీద మరోసారి పరువు నష్టం దావా వేసారు,అయితే  జైట్లీని  అభ్యంతరకర పదాలతో సంభోదించాలని  న్యాయవాదికి తాను చెప్పలేదని..కెజ్రీవాల్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు.

కెజ్రీవాల్ కు అస్సలు షాకిచ్చిన  లాయర్ జెఠ్మలానీ….!

ఏ.. కెజ్రీవాల్ అన్ని అవద్దాలాడుతున్నడు  ఆయన  అనుమంటనే  అరుణ్ జైట్లీని (నిజాయితీ లేని వ్యక్తి) ఆ పదాలతోని మాట్లాడిన, ఇప్పుడేమో  కెజ్రీవాల్  నేను చెప్పనే చెప్పలేదని..అనడం నాకు మస్తు బాదైతుంది,అందుకే ఈ కేసునుంచి నేను తప్పుకొంటున్న, అంతేకాదు నాకు కెజ్రీవాల్ నుంచి రావాల్సిన  2 కోట్ల ఫీజును గుడ వదులుకుంటున్న …ఇంతకు ముందు  పైసలు తీస్కోకుంట మస్తు కేసులు వాదించిన..గిది గుడ గ ఖాతాల్నే ఏస్కుంట అని చెప్పిండు.సూడాలే మరి ముందు ముందు కెజ్రీవాల్ సారు కేసు ఇంకెంత క్రేజీగా ముందుకు వోతదో అనేది.