కాంగ్రెస్‌లా ఆ ఏడుపేంటి? దమ్ముంటే నన్ను ఢీ కొట్టండి - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్‌లా ఆ ఏడుపేంటి? దమ్ముంటే నన్ను ఢీ కొట్టండి

March 23, 2022

fgbhf

ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఆప్ పార్టీ కేంద్రంలోని బీజేపీపై విరుచుకుపడుతోంది. ఎన్నికలు టైం ప్రకారం నిర్వహిస్తే మేమే గెలుస్తామని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఒకవేళ బీజేపీ గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ప్రపంచంలోనే పెద్ద పార్టీగా చెప్పుకొనే బీజేపీ.. తమ లాంటి చిన్న పార్టీలను చూసి భయపడుతుందని ఎద్దేవా చేశారు. ఎన్నికలను వాయిదా వేయించి, రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. మరో నేత మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌లా ఏడవడం ఆపి, దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కోండి. కనీసం పది సీట్లు సాధిస్తే అదే మీకు గొప్ప’ అని అభిప్రాయపడ్డారు. కాగా, మూడు కార్పొరేషన్లుగా ఉన్న ఢిల్లీ మున్సిపాల్టీని ఒకే గొడుగు కిందకు తెచ్చే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదించింది. అయితే ఏడేళ్ల నుంచి ఏం చేస్తున్నారనీ, ఎన్నికలు పెట్టాల్సిన సమయంలో ఇలాంటి నిర్ణయాలేంటని ఆప్ ప్రశ్నిస్తోంది.