“Arvind Kejriwal of cricket” – Gautam Gambhir mercilessly trolled for his on-air comments on Virat Kohli
mictv telugu

సచిన్‌తో..కోహ్లీకి పోలికనా…అంత సీన్ లేదక్కడ ..

January 11, 2023

టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ తిరిగి అద్భుతమైన ఫామ్ అందుకున్నాడు. కొన్నిరోజులు పేలవ ఆట తీరు ప్రదర్శించిన విరాట్..గత సంవత్సరం ఆసియా కప్ నుంచి అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే గత సంవత్సరాన్ని శతకంతో ముగించిన విరాట్..2023 సంవత్సరాన్ని శ్రీలంకపై సెంచరీ సాధించి ప్రారంభించాడు. బుధవారం జరిగిన మొదటి వన్డేలో కోహ్లీ 45వ శతకాన్ని అందుకున్నాడు. ఈసెంచరీతో పలు రికార్డులను రన్ మిషన్ సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించడానికి కేవలం ఐదు శతకాలు మాత్రమే ఉన్నాయి. 49 సెంచరీలతో కోహ్లీ కంటే సచిన్ ముందున్నాడు. దీంతో అందరూ కోహ్లిని సచిన్‌తో పోలుస్తున్నారు. అప్పట్లో సచిన్..ఇప్పుడు కోహ్లీ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. అయితే టీం ఇండియా మాజీ ఓపెనర్ గంభీర్ మాత్రం ఈ పోలీకను వ్యతిరేకిస్తున్నాడు. సచిన్ టెండుల్కర్‌తో విరాట్ కోహ్లిని పోల్చలేమని గంభీర్ అభిప్రాయపడ్డాడు. వారిద్దరూ వేర్వేరు తరాలకు చెందిన క్రికెటర్లన్నాడు. సచిన్ ఆడినప్పుడు ఉన్న ఫీల్డింగ్ నిబంధనలు, ఇప్పుడున్న ఫీల్డింగ్ నిబంధనలు వేరన్నాడు. రెండో కొత్త బాల్ అందుబాటులోకి రావడం.. కొన్ని రూల్స్ మారడం ప్రస్తుత బ్యాటర్లకు అనుకూలంగా మారిందన్నాడు. గంభీర్ వ్యాఖ్యలపై కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. దేశానికి మొత్తం నచ్చిన కోహ్లీ..గంభీర్‎కు మాత్రం ఎప్పటికీ నచ్చడంటూ కామెంట్స్ చేస్తున్నారు. గంభీర్‌ను క్రికెటర్లో అరవింద్ కేజ్రీవాల్‌ అంటూ ట్రోల్స్ నడుస్తున్నాయి.

2013లో ఐపీఎల్ సీజన్ సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి, అప్పటి కేకేఆర్ కెప్టెన్ గౌతం గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.. ఔటై పెవిలియన్‌కి వెళ్తున్న విరాట్ కోహ్లీ‌పై గౌతమ్ గంభీర్ కవ్వింపులకి దిగాడు. దాంతో.. సహనం కోల్పోయిన విరాట్ కోహ్లీ.. గంభీర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరూ దాదాపు కొట్టుకునేలా కనిపించారు. అయితే.. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ క్రికెటర్స్ ఇద్దరికీ సర్దిచెప్పి గొడవను సద్ధమణించారు. ఈ గొడవ జరిగాక పలుమార్లు కోహ్లీకి వ్యతిరేకంగా గంభీర్ కామెంట్స్ చేశాడు.