ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మెలానియా - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మెలానియా

February 25, 2020

bcb vgb

ట్రంప్‌ సతీమణి మెలానియా..ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. దక్షిణ మోతిబాగ్‌ ఏరియాలోని సర్వోదయ కో-ఎడ్యుకేషనల్‌ సెకండరీ స్కూల్‌ను సందర్శించారు. మెలానియాకు పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న హ్యాపినెస్‌ క్లాస్‌రూమ్‌ విద్యార్థులతో మెలానియా ముచ్చటించారు. 

రెండేళ్ల క్రితం ఢిల్లీ ప్రభుత్వం హ్యాపినెస్‌ కరిక్యూలమ్‌ను రూపొందించింది. దీనిని నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తారు. దీని ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, స్వీయ అవగాహనను ఏర్పరచుకోవడంతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెరిగేలా పాఠాలు బోధిస్తారు. తీవ్ర ఒత్తిడి ఉన్న సమయాల్లో కూడా తమకు ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించి.. ప్రశాంతత పొందడమే ఈ కరిక్యూలమ్‌ ముఖ్యఉద్దేశం. అమెరికా ప్రథమ మహిళ మెలానియా హ్యాపినెస్ క్లాస్ రూమ్‌ను సందర్శించడం సంతోషకరమైన విషయమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.