ఎన్నికల సీన్‌లోకి కేజ్రీ కూతురు..ఆ వ్యాఖ్యలకు ఘాటు రిప్లే - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్నికల సీన్‌లోకి కేజ్రీ కూతురు..ఆ వ్యాఖ్యలకు ఘాటు రిప్లే

February 5, 2020

cvbnm,

ఢిల్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నారు. ఈ ఎన్నికలు ఆప్‌ మనుగడకు తప్పనిసరి కావడం, గత కొన్ని రోజులుగా రాష్ట్రాలను చేజార్చుకుంటున్న బీజేపీకి పట్టుబిగించే అంశం కావడంతో రెండు పార్టీలూ పోటీపోటీగా ఉన్నాయి.  ఆమ్ ఆద్మీపార్టీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓ దశలో కేజ్రీవాల్ ఉగ్రవాది అంటూ బీజేపీ నాయకులు తీవ్రర విమర్శలు చేశారు. ఒకరిపై ఒకరు విమర్శల దాడితో ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. 

తాజాగా ఈ ఎన్నికల సీన్‌లోకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూతురు హర్షిత ఎంట్రీ ఇచ్చారు. తన తండ్రిని బీజేపీ నేతలు ఉగ్రవాదితో పోల్చడంపై ఘాటైన సమాధానం ఇచ్చారు. ‘ఉచితంగా వైద్య సేవలు అందించడం, పిల్లలలకు మంచి విద్య అందించడాన్ని ఉగ్రవాదం అంటారా. ఆయన ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి. మా కుటుంబంలోని వారందరితో ప్రతి రోజు భగవద్గీత పటించేలా చేస్తారు. సోదర భావం పెంపొందించే ప్రయత్నాలు చేసినందుకా ఆయన్ను ఉగ్రవాది అంటున్నారు’ అని ప్రశ్నించారు. ప్రకాశ్‌ జవదేకర్ సహా కొంత మంది నాయకులు కేజ్రీవాల్‌ ఓ ఉగ్రవాది అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.