రాజ్యసభ సభ్యుడిగా దేవెగౌడ ప్రమాణం.. 24 ఏళ్ల తర్వాత..  - MicTv.in - Telugu News
mictv telugu

రాజ్యసభ సభ్యుడిగా దేవెగౌడ ప్రమాణం.. 24 ఏళ్ల తర్వాత.. 

September 20, 2020

bgcvb

24 ఏళ్ల తర్వాత మాజీ ప్రధాని, జేడీఎస్ నేత హెచ్‌డీ దేవెగౌడ (87) ఆదివారం రాజ్యసభలో అడుగు పెట్టారు. కర్నాటకకు చెందిన నలుగురు సభ్యులు జూన్ 25న పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో జూన్‌లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన దేవెగౌడ నేడు కన్నడలో ప్రమాణ స్వీకారం చేశారు. కరోనా కారణంగా దేవేగౌడ ఇంతకాలం ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. కొత్తగా ఎన్నికైన 61 మంది సభ్యుల్లో 45 మంది జూలై 22న ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఉదయం సమావేశం ప్రారంభమవ్వగానే సభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు కొత్తగా ఎన్నికైన సభ్యులను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. దెవెగౌడ వెళ్లి తన మాతృభాష కన్నడలో ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం స్పందించిన వెంకయ్యనాయుడు మాజీ ప్రధాని, సీనియర్‌ నేత రాకతో సభకు మరింత బలం చేకూరిందని అన్నారు. పలువురు సభ్యులు దేవెగౌడకు అభినందనలు తెలిపారు.

కాగా, 1996 నుంచి జనతాదళ్‌(ఎస్‌) పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మొదటివ్యక్తిగా దేవెగౌడ నిలిచారు. ప్రధానిగా పనిచేసిన సమయంలో దేవెగౌడ తొలిసారిగా రాజ్యసభలోకి ప్రవేశించారు. 1996-97 వరకు ఆయన ప్రధానిగా పని చేశారు. ఆ తర్వాత 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కర్నాటకలోని హసన్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. అనంతరం 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేవేగౌడ ఓడిపోయారు.