జియో లాక్‌డౌన్ ఆఫర్.. నాలుగు ప్రయోజనాలతో.. - MicTv.in - Telugu News
mictv telugu

జియో లాక్‌డౌన్ ఆఫర్.. నాలుగు ప్రయోజనాలతో..

June 3, 2020

 

4x Benefits

జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 4x బెనిఫిట్స్(రిలయన్స్‌ డిజిటల్‌, ట్రెండ్స్‌, ట్రెండ్స్‌ ఫుట్‌వేర్‌, ఎజియో) పేరుతో కొత్త ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఈ ఆఫర్‌ను సొంతం చేసుకోవాలనుకునేవారు రూ.249 లేదా అంతకుమించి రీచార్జ్‌ చేసుకున్నవారికి నాలుగు డిస్కౌంట్‌ కూపన్లు ఇస్తామని సంస్థ వెల్లడించింది. ఆ కూపన్లతో రిలయన్స్ డిజిటల్, ట్రెండ్స్, ట్రెండ్స్‌ ఫుట్‌వేర్‌, ఎజియో కోనుగోళ్లపై రాయతీ పొందవచ్చని సంస్థ ప్రకటించింది. అయితే రీచార్జ్‌ చేసుకున్న ప్రతీ కష్టమర్‌ మైజియో యాప్‌లోని కూపన్స్ సెక్షన్‌లో జమ అవుతాయని, షాపింగ్ చేసేటప్పుడు కష్టమర్లు రాయతీ పొందవచ్చని చెప్పింది. 

ఇదివరకే రీచార్జ్‌ చేసుకున్నవారు కూడా ఈ ఆఫర్‌కు అర్హులని సంస్థ ప్రకటించింది. అయితే అడ్వాన్స్ రీచార్జ్‌ చేసుకున్నవారు మై జియో యాప్‌లోని మై ప్లాన్స్‌ సెక్షన్‌లో ఆఫర్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని స్పష్టంచేసింది. ఈ ఆఫర్‌ జూన్ 1 నుంచి 30 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ సడలింపు వల్ల తమ ఆఫర్‌ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటుందని సంస్థ ఉన్నతాధికారులు అన్నారు.