As Ravindra Jadeja Bats for Wife Rivaba in Gujarat, Can She Hit a Sixer for BJP? 
mictv telugu

ఆమె సిక్స్ కొడుతుందా?

November 22, 2022

గుజరాత్ ఎన్నికల్లో అందరి చూపు జామ్‌నగర్ ఈస్ట్ నియోజకవర్గంపైనే. ఈ నియోజకవర్గం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాని మోదీ, బీజేపీ స్ట్రాటజిస్ట్ అమిత్ షా ప్రత్యేక ఫోకస్ చేశారు. ఎందుకంటే ఇక్కడి నుంచి పోటీచేస్తున్నది రివాబా జడేజా. ఈమె టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య. జామ్‌నగర్ గ్రౌండ్‌లో రివాబా సిక్స్ కొడుతుందా?ఈ సెగ్మెంట్‌లో కాషాయ జెండా ఎగరేస్తుందా?

జాబ్‌నగర్‌లో…
గుజరాత్‌లో బీజేపీ ప్రచారం జోరుగా సాగుతోంది. ఏడోసారి విజయం సాధించి రికార్డ్ సృష్టించాలని ప్రయత్నిస్తోంది. జామ్ నగర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈమె తరఫున రవీంద్ర జడేజా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రచారానికొచ్చిన అమిత్ షాకు ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు. జాబ్‌నగర్‌లో అమిత్ షా సైతం ప్రచారం చేస్తున్నారు. స్ఫూర్తినిచ్చే ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం ,జడేజా సహకారం తనను ముందుకు నడిపిస్తున్నాయని రివాబా చెబుతుంది.

కపుల్ క్యాంపెయిన్

“షూలు వేసుకుని ప్రచారం చేయడం కష్టంగా ఉంది. గుళ్లకు వెళ్లినప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బందిగా ఉంది. ఈ విషయం జడేజాతో చెప్పా.ఆయన వెంటనే చెప్పులు కొని పంపించారు. నా భర్త నాకు ఎంతగా సహకరిస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం”అని రివాబా జడేజా చెబుతోంది. మంగళవారం నుంచి జడేజా ప్రచారం ప్రారంభించారు. పార్టీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రచారం చేస్తున్నాం..ఆయన్ను కలవడానికి జనం ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు అని ఆమె అన్నారు. నాకోసం బాగా కష్టపడుతున్నారు.రోజంతా ప్రజల్ని కలిసేందుకు సమావేశాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

ముక్కోణపు పోటీ

కాంగ్రెస్ తరఫున బిపేంద్రసిన్హా జడేజా, ఆప్ తరఫున బీజేపీ మాజీ నేత కర్సన్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఆప్ తరఫున జడేజా సోదరి నైనా జడేజా ప్రచారం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మేంద్రసిన్హా ఈ సారి పోటీ చేయడం లేదు. ఈ స్థానంలోనే రివాబా జడేజా పోటీ చేస్తోంది. ఆయన పూర్తి సహకారం తనకు ఉందని రివాబా అంటోంది.

సదా మీ సేవలో
“చిన్నప్పటి సామాజిక సేవ చేయడం అంటే ఇష్టం. సివిల్ సర్వీసుల్లో జాయిన్ అవ్వాలన్న ఆలోచన ఉండేది. అందుకే ఢిల్లీ వెళ్లి ఎయిర్ ఫోర్స్‌లో మూడేళ్లు పనిచేశా. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇంటికి పరిమితం అయ్యా.కుటుంబానికే ప్రయారిటీ ఇచ్చా. మళ్లీ సామాజిక సేవకోసం ఇలా ప్రజల ముందుకొచ్చా” అని రివాబా చెబుతోంది.

2019లో బీజేపీలోకి…

“2018 లో ప్రధాని మోదీని కలిశా.పలు అంశాలపై ఆయనతో చర్చించాను. ముఖ్యమంత్రి నుంచి ప్రధాని అయిన మోదీని చూసి నేను రియలైజ్ అయ్యా.డౌన్ టు ఎర్త్ ఎలా ఉండాలో ఆయన్నుంచి నేర్చుకున్నా. ప్రధాని మోదీ ప్రోత్సాహంతో నా కలలు నెరవేర్చుకునేందుకు 2019లో బీజేపీలో జాయిన్ అయ్యా”అని రివాబా తెలిపింది. జడేజాతో కలిసి ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎందుకు రాలేదని గ్రామాల్లో ప్రజలు అడుగుతున్నారు. అందరిలా అక్కడకు వెళ్లకపోయినా ఇప్పుడు ఆయనతో కలిసి ప్రచారం చేయడం ఆనందంగా ఆమె అంటోంది. మహిళా సాధికారతే లక్ష్యమన్నారు.గెలిస్తే జామ్ నగర్ ని స్మార్ట్ గా మారుస్తానని అంటున్నారు. చూడాలి జామ్ నగర్‌లో ఆమె సిక్స్ కొడుతుందో..లేదో..?