భారతీయ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ‘ఆస్కార్’ అవార్డు (oscars awards 2023)ను ‘ఆర్‌ఆర్‌ఆర్’ సాకారం చేసింది. అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ ‘నాటు నాటు…’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో.. ఆస్కార్ దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా రికార్డుకెక్కింది. సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ వేదికపైకి వెళ్లి అవార్డును స్వీకరించారు. “ఆర్‌ఆర్‌ఆర్.. నన్ను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టింది. RRR దేశాన్ని గర్వపడేలా చేసింది.” అని అవార్డు అందుకున్న అనంతరం కీరవాణి బావోద్వేగంతో మాట్లాడారు.
❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥 #NaatuNaatu #RRRMovie #Oscars95 pic.twitter.com/yIDgYJlTXH
— RRR Movie (@RRRMovie) March 13, 2023
ఇక ఆస్కార్ వేదికపై రెడ్ డ్రెస్‌లో ఉన్న ఓ బ్లాక్ బ్యూటీ RRR… అంటూ అవార్డ్ అనౌన్స్ చేయగానే.. థియేటర్‌లో బ్యాక్ సీట్‌లో కూర్చొన్న రాజమౌళి కుటుంబం ఒక్కసారిగా ఎగిరి గంతేసింది. దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి, కొడుకు కార్తీకేయ, కీరవాణి తనయుడు శ్రీ సింహ ఆనందంతో కేరింతలు కొట్టారు. బెస్ట్ సాంగ్ అనౌన్స్‌మెంట్‌తో డాల్బీ థియేటర్ అంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ఆ మధుర క్షణాలను RRR movie టీమ్ సోషల్ మీడియా వేదికగా.. పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.