As the movie flopped, it didn't release for 3 months: Sharwanand
mictv telugu

ఆ సినిమా ఫ్లాప్‌ అవడంతో..3మంత్స్ బయటకి రాలేదు: శర్వానంద్

September 8, 2022

టాలీవుడ్‌లో ‘గమ్యం’, ‘ప్రస్థానం’ వంటి చిత్రాలలో నటించి తన నటనతో, డైలాగులతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి, మంచి గుర్తింపును తెచ్చుకున్నారు హీరో శర్వానంద్. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా సినిమా కెరీర్‌ స్టార్ట్ చేసి, హీరోగా విభిన్న సినిమాలు చేస్తూ, హిట్లతో, ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ‘ఒకే ఒక జీవితం’సినిమా సెప్టెంబ‌ర్ 9న ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శర్వానంద్ కొన్ని సంచలన విషయాలను వెల్లడించాడు.

” నేను, సాయి పల్లవి నటించిన ‘ప‌డిప‌డి లేచె మ‌న‌సు’ సినిమా 2018లో విడుద‌లైంది. ఆ చిత్రంపై ఆ టైంలో నేను ఫుల్ కాన్ఫిడెంట్‌‌గా ఉన్నా. మొద‌టి రోజు నుండి సినిమా రిలీజ్ అయ్యే వరకు. కానీ, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆ సినిమా ఫెయిల్ అయ్యింది. ఏం చేయాలో అర్థం కాలేదు. నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంద‌ని భావించా. కానీ, ఆశించిన విధంగా రిజల్ట్ రాకపోవడంతో తీవ్రంగా నిరాశ‌ప‌డ్డ. దాంతో మూడు నెల‌లపాటు ఎక్కడికి వెళ్లకుండా, ఎవరినీ కలవకుండా ఇంట్లోనే ఉన్నా. బ‌య‌ట‌ికి కూడా రాలేద‌ు. అంత‌లా ఆ సినిమా ఫ‌లితం నన్ను నిరాశ‌ ప‌రిచింది” అని శర్వానంద్ అన్నారు.

ఇక, ‘ఒకే ఒక జీవితం’సినిమా విషయానికొస్తే.. సైన్స్ ఫిక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కింది. తెలుగుతోపాటు త‌మిళంలోను ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో అమ‌ల అక్కినేని కీల‌క పాత్ర‌లో న‌టించారు. శ‌ర్వాకు జోడీగా రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. మ్ వారియ‌ర్స్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎస్‌.ఆర్ ప్ర‌కాష్ బాబు, ఎస్‌.ఆర్ ప్ర‌భు ఈ సినిమాను నిర్మించారు.