అక్బరుద్దీన్‌ను నిర్దోషా? అప్పీలుకు వెళ్లాలి... బండి - MicTv.in - Telugu News
mictv telugu

అక్బరుద్దీన్‌ను నిర్దోషా? అప్పీలుకు వెళ్లాలి… బండి

April 13, 2022

bandui

వివాదాస్పద ప్రసంగం కేసులో మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. కోర్టు తీర్పు తమను ఆశ్చర్యం కలిగించిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ‘అక్బరుద్దీన్ ఏమన్నాడో ప్రపంచమంతా చూసింది. అయినా అతణ్ని నిర్దోషిగా ప్రకటించడం వింతగా ఉంది. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌ల కుమ్కక్కు రాజకీయాలకు ఇది అద్దం పడుతోంది. ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలి. కేసుపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్పీలుకు వెళ్లాలి’ అని బండి డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ 2012 డిసెంబర్‌లో నిర్మల్, నిజామాబాద్ లతో ప్రచారం నిర్వహిస్తూ హిందువులను ఉద్దేశించి విద్వేషవ్యాఖ్యలు చేశారు. అయితే అధారాలు లేవంటూ నాంపల్లి కోర్టు అతణ్ని నిర్దోషిగా ప్రకటించి, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు అని సూచించింది.