అడుక్కోడం లేదు.. సుప్రీం కోర్టు తోపేమీ కాదు.. ఒవైసీ - MicTv.in - Telugu News
mictv telugu

అడుక్కోడం లేదు.. సుప్రీం కోర్టు తోపేమీ కాదు.. ఒవైసీ

November 9, 2019

అయోధ్యలోని వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయోధ్యలో ముస్లింలకు మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాలు ఇవ్వాలన్న కోర్టు సూచనను తప్పుబట్టారు. తాము అడుక్కోవడం లేదని, ఆ ఆఫర్ తమకు సమ్మతం కాదని అన్నారు. ‘ మేం వేరే చోట మసీదు కట్టుకోడానికి పోరాడ్డం లేదు. భిక్ష అడగడం లేదు. న్యాయం కోరుతున్నాం. కానీ నిజాలపై నమ్మకాలు గెలిచాయి. అయినా మాకు రాజ్యంగంపై పూర్తి విశ్వాసం ఉబంది. మా చట్టబద్ధ హక్కుల కోసం మేం పోరాటం సాగిస్తాం. పర్సనల్ లా బోర్డు మాటా మా మాట…’ అని అన్నారు. సుప్రీం కోర్టు అత్యున్నతమైంది కావొచ్చుగాని అని పొరపాట్లు చెయ్యనంత గొప్పదేమీ కాబోదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు మసీదు తాళాలు తెరవకుంటే అది అదిప్పుడు ముస్లింల ఆధీనంలోనే ఉండేదన్నారు. ‘1992లొ మసీదును కూలగొట్టకపోతే ఇప్పుడేం జరిగేది? కోర్టు తీర్పు ఎలా ఉండేది? బాబ్రీ మసీదును కూల్చిన వారికే అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించడం ఏమిటి?’ అని ప్రశ్నించారు.

owaisi.

ర్పుపై ముస్లిం పర్సనల్‌ లా బోర్డు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అది తమకు ఆమోదయోగ్యం కాదని, పునస్సమీక్షించాలని కోర్టును కోరతామని  పేర్కంది. భవిష్యత్ కార్యాచరణపై తమ కార్యవర్గం సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ‘15వ శతాబ్దానికి ముందు ఆధారాలు ఉంటే 15వ శతాబ్దం తర్వాత కూడా ఆధారాలు ఉంటాయి కదా? వివాదస్పద భూమిలో ముస్లింలు ప్రార్థన చేస్తున్న విషయాన్ని సుప్రీం కోర్టు కూడా పరిగణనలోకి తీసుకుంది కదా..’ అని పేర్కొంది.