Asaduddin Owaisi comments on Gnanavapi Mosque
mictv telugu

ఇప్పటికే ఒకటి పోయింది, మరోటి కోల్పోవడానికి ఒప్పుకోం : ఓవైసీ

May 13, 2022

Asaduddin Owaisi comments on Gnanavapi Mosque

వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు వీడియో సర్వేకు జిల్లా సివిల్ కోర్టు అనుమతి ఇవ్వడాన్ని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తీర్పు ప్రార్ధనా స్థలాల చట్టం – 1991 ను ఉల్లంఘించడమేనని ఆరోపించారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా మతపరమైన ప్రాంతాల స్వభావాన్ని మార్చాలనుకునే వ్యక్తులకు మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని తెలిపారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని యోగి ఆదిత్యనాథ్‌ని కోరారు. ఇప్పటికే బాబ్రీ మసీదును కోల్పోయామనీ, ఇప్పుడు మరోటి కోల్పోవడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు.

కోర్టు ఇచ్చిన తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు, మసీదు కమిటీలు సుప్రీంకోర్టులో సవాలు చేయాలని సూచించారు. కాగా, 2021లో ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు కోర్టులో పిటిషన్ వేశారు. మసీదు వెలుపల ఉన్న హిందూ దేవతల విగ్రహాలను పూజించే అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో కోర్టు సర్వే కోసం ఓ కమిటీని నియమించింది. మే 17 కల్లా సర్వే పూర్తి చేయాలని కమిటీని ఆదేశించింది. అయితే తీర్పునిచ్చిన జడ్జి దివాకర్ తనకు, తన కుటుంబ సభ్యుల భద్రతకు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.