మోదీ 'దీపాల' డ్రామాలు వద్దు..అసదుద్దీన్ ఒవైసీ - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ ‘దీపాల’ డ్రామాలు వద్దు..అసదుద్దీన్ ఒవైసీ

April 3, 2020

Asaduddin Owaisi slams PM Modi over light message

ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇంట్లోని లైట్లు అన్నీ ఆర్పేసి, ఇంటి ఆవరణలో దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని, టార్చ్‌లైట్, స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ ఆన్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు.

“ఈ దేశం ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ కాదు. దేశ ప్రజలందరూ మనుషులే, వారికీ ఆశలు, ఆశయాలు ఉంటాయి. 9 నిమిషాల గిమ్మిక్కులతో జీవితాలను దిగజార్చవద్దు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఏం లభిస్తోంది? పేదలకు ఎలాంటి ఊరట దక్కుతోంది? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటున్నాం. చేయాల్సింది చేయకుండా మళ్లీ ఓ కొత్త డ్రామాకు తెరలేపారు. ఈ ట్యూబ్ లైట్ ఐడియా ఎక్కడినుంచి వచ్చింది. దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఆకలితో అలమటిస్తూ, గూడు లేక కాలినడకన ఇళ్లకు పయనమయ్యారు. ప్రధాని గారూ, ఎక్కడుంది మీరు చెబుతున్న వెలుగు? వలస కార్మికుల ద్వారా కరోనా కేసులు మరింత పెరుగుతున్నాయి. ఆర్థికసాయం అందించాలని సీఎంలు కోరుతుంటే లైట్లు ఆర్పేయాలని చెబుతారా?” అంటూ ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు. అలాగే నిజాముద్దీన్‌ మర్కజ్‌ బహిరంగ సమావేశానికి హాజరై వచ్చిన వారు వైద్య పరీక్షలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.