జీవనశైలి సరిగా లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల పురుషులలో సత్తువ తగ్గిపోతోంది. కేవలం స్టామినా మాత్రమే కాదు, జీర్ణక్రియ, పొట్ట, పైల్స్ వంటి సమస్యలకు కూడా ఇది కారణం అవుతుంది. అంతేకాదు బలహీనత కారణంగా, అప్పుడప్పుడు కండరాలలో నొప్పి, బద్ధకం ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో, ఇంగువ తీసుకోవడం పురుషులకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు, పాలలో దేశీ ఇంగువ కలిపి తాగడం వల్ల పురుషులకు సంబంధించిన అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
1. స్టామినా పెంచడంలో సహాయపడుతుంది:
పాలు, దేశీ నెయ్యి, ఇంగువ ఈ మూడు కూడా శక్తిని పెంచడానికి వేగంగా పనిచేస్తాయి. పాలలో ప్రొటీన్లు, నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్లు శక్తిని పెంచి, ఇంగువ కండరాలకు బలాన్ని ఇస్తుంది. అలాగే, నెయ్యి తీసుకోవడం వల్ల ఒత్తిడి, మానసిక కల్లోలం తగ్గుతుంది. పురుషులలో శారీరక బలహీనతను తొలగించడంతోపాటు శక్తిని పెంచడంలో సహాయపడుతాయి.
2. పురుషులలో పైల్స్ చికిత్స:
ఈ మధ్యకాలంలో చాలామంది పైల్స్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కారణం ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశీ నెయ్యి, ఇంగువ కలిపిన పాలు తాగడం వల్ల పైల్స్ సమస్య తగ్గుతుంది.
3. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
ఇంగువ ఎల్లప్పుడూ శరీరంలో వాత, పిత్త, కఫాలను సమతుల్యం చేస్తుంది. ఈ సందర్భంలో, ఇంగువ తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇంగువ, నెయ్యి కలిపిన పాలను తాగడం వల్ల జీర్ణవ్యవస్థను వేగవంతం చేస్తుంది. అలాగే, ఇది అజీర్ణం, అసిడిటీని తగ్గిస్తుంది.
4. కండరాలకు బలాన్ని ఇస్తుంది
వృద్ధాప్యంతో, పురుషుల శరీరంలో కాల్షియం లోపం కూడా ప్రారంభమవుతుంది. అదే సమయంలో కండరాలు బలహీనపడతాయి. అటువంటి పరిస్థితిలో, పాలు, దేశీ నెయ్యి, ఇంగువ తీసుకోవడం వల్ల కండరాలలో కాల్షియం, ఒమేగా-3 వృద్ధి చెందుతుంది. కండరాలు బలంగా మారుతాయి.