ఆసారాం బాబా.. గరం గరం..! - MicTv.in - Telugu News
mictv telugu

ఆసారాం బాబా.. గరం గరం..!

September 15, 2017

నకిలీ బాబాల లిస్టులో చేరిన ఆసారాం బాబా మీడియా మీద అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. జోధ్ పూర్ లోని ఎస్ సి – ఎస్ టి కోర్టుకు విచారణకు వచ్చిన ఆయనను మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు చాలా కోపంగా చూసాడు. నోరు మూసుకోండి  అన్నట్టు ముక్కు మీద వేలు పెట్టి చూపించాడు. తన పేరు చెప్పడానికి కూడా నిరాకరించాడు. నకిలీ బాబాల లిస్టులో మీ పేరు వుంది కదా ? అన్న ప్రశ్నకు తీవ్ర స్థాయిలో ఉడుక్కున్నాడు. నోరు తెరిచి చాలా సేపటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీడియాను శతృవు కన్నా హీనంగా చూసాడు. నేను సాధువును కాను, గాడిదనని చెప్పి విసురుగా కోర్టు లోపలికి వెళ్లి పోయాడు. ఆసారాం బాబా గరంను చూసిన వారంతా ముక్కు మీద వేలేస్కున్నారు.