Asha Parekh to be honoured with Dadasaheb Phalke Award for 2020
mictv telugu

అశా పరేఖ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్

September 27, 2022

Asha Parekh to be honoured with Dadasaheb Phalke Award for 2020

బాలీవుడ్ దిగ్గజ నటి అశా పరేఖ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించింది. సినిమా రంగంలో అత్యుత్తమ పురస్కారం ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్’ 2020 సంవత్సరానికి గాను ఆశా పారేఖ్ ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచారం, ప్రసార శాఖ మంత్రి మంగళవారం ప్రకటించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుకను సెప్టెంబర్ 30న నిర్వహించనున్నారు. సినిమా రంగానికి ఆమె చేసిన సేవలకు గానూ 1992లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మ శ్రీ అవార్డు సైతం అందజేసింది.

చైల్డ్ ఆర్టిస్ట్‏గా సినీరంగ ప్రవేశం చేసిన ఆశా పరేఖ్.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. 1952లో ఓ కార్యక్రమంలో స్టేజ్ పై డాన్స్ చేస్తున్న పదేళ్ల ఆశాను చూసిన ప్రముఖ డైరెక్టర్ బిమల్ రాయ్.. ఆమెను మా సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నచించినప్పటికీ అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కొన్నేళ్లపాటు ఇండస్రీకి దూరంగా ఉండి.. విద్యను పూర్తిచేశారు ఆశా. ఆ తర్వాత పదహారేళ్ల వయసులో హీరోయిన్‏గా అరంగేట్రం చేసింది. డైరెక్టర్ నాసిర్ హుస్సేన్ తెరకెక్కించిన దిల్ దేకే దేఖో (1959)లో షమ్మీ కపూర్ సరసన కథానాయికగా నటించింది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన కాటి పతంగ్, తీస్రీ మంజిల్, కారవాన్ చిత్రాలు అద్భుత విజయం సాధించాయి. ఈ చిత్రాలతోనే ఆశ మంచి గుర్తింపు పొందారు. నటిగానే కాక దర్శకురాలిగా, నిర్మాతగానూ తనదైన ముద్ర వేశారు ఆశా పారేఖ్.