మరి ఈ ‘రేప్’ బాబా సంగతేంటి? - MicTv.in - Telugu News
mictv telugu

మరి ఈ ‘రేప్’ బాబా సంగతేంటి?

August 28, 2017

రేప్ కేసులో డేరా బాబా గుర్మీత్ వ్యవహారం జైలుశిక్షతో కొలిక్కి వస్తోంది. అయితే రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో బడా బాబా కేసు మాత్రం ఏళ్ల తరబడి సా..గు..తోంది. దీనిపై సుప్రీం కోర్టు సోమవారం కొరడా ఝళిపించింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ  కేసు విచారణ ఎంతవరకు వచ్చిందని? అసలు ఎందుకు జాప్యం జరుగుతోందని గుజరాత్ ప్రభుత్వాన్ని కడిగిపారేసింది.

‘మీరింతవరకు బాధితురాలిని ప్రశ్నించనే లేదు. ఎందుకింత తాత్సారం చేస్తున్నారు? బాధితురాలి వాంగ్మూలాన్ని త్వరగా రికార్డు చేయండి’’ అని ఆదేశించింది. అయితే ఆశారాం తీరు వల్లే జాప్యం జరుగుతోదని గుజరాత్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.

ఈ కేసులో ఆశారాం నాలుగేళ్లుగా జైల్లో ఉన్నారు. అయితే శిక్ష ఖరారు చేయడానికి వీలుగా బాధితురాలిని కోర్టు ప్రశ్నించాల్సి ఉంది. 76 ఏళ్ల ఆశారాం 2013లో రాజస్థాన్ లోని తన ఆశ్రమంలో బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని కేసు నమోదైంది. తర్వాత మరో నెండు నెలలకు  సూరత్ లోని ఆశ్రమంలో ఆయన, ఆయన కొడుకు నారాయణ్ సాయి.. ఇద్దరు యువతులపై అత్యాచారం చేశారని కూడా కేసులున్నాయి. ఈ కేసు గాంధీనగర్ కోర్టులో పెండింగ్ లో ఉంది. సుప్రీం కోర్టు ప్రస్తుతం ఆశారాం బెయిల్ పిటిషన్ ను విచారిస్తోంది.

 

వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు ఆశారాం బాపూపై నమోదైన అత్యాచార కేసు విచారణలో విపరీత జాప్యం పట్ల గుజరాత్‌ సర్కార్‌ను సుప్రీంకోర్టు నిలదీసింది. నిందితుడి బెయిల్‌ పిటిషన్‌ విచారిస్తూ ఈ కేసు పురోగతిపై నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ‘ఈ కేసులో ఎందుకింత జాప్యం జరుగుతున్నది..బాధితురాలిని ఇంతవరకూ ఎందుకు ప్రశ్నించలేద’ని గుజరాత్‌ ప్రభుత్వంపై కోర్డు మండిపడింది. సూరత్‌లోని తన ఆశ్రమంలో 16 ఏళ్ల స్కూల్‌ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై 2013 ఆగస్టు నుంచి  ఆథ్మాతిక గురువు ఆశారాం రాజస్థాన్‌లోని జైలులో ఉన్నారు.

గాంధీనగర్‌లోని న్యాయస్థానంలో సాగుతున్న కేసు విచారణలో ఆశారాం తీరుతోనే జాప్యం జరుగుతున్నదని గుజరాత్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. కేసులో ఇంతవరకూ పలువురి సాక్ష్యాలు నమోదు చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఆశారాంకు బెయిల్‌ మంజూరు చేసేందుకు సుప్రీం నిరాకరించింది.