పబ్‌లో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆశిష్ గౌడ్‌పై చర్యలు తీసుకోవాలని నటి సంజన పోలీసులను కోరింది. ఆశిష్ గౌడ్ విషయంలో రాజీపడనని తేల్చిచెప్పింది. బుధవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సంజన ఫిర్యాదు చేసి నాలుగు రోజులైనా చర్యలు తీసుకోకపోవడంపై అధికారులను ప్రశ్నించింది. పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్ మాదాపూర్‌లో ఓ పబ్‌లో నటి సంజన పట్ల అమర్యాదగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నటి సంజన పోలీసులను ఆశ్రయించింది. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది.
పబ్‌లో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సంజన విజ్ఞప్తి చేసింది. ఈ కేసులో తనపై అనేక ఒత్తిళ్లు వస్తున్నాయని.. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు తనను సంప్రదిస్తున్నారని సంజన తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.