అశోక్ గెహ్లట్‌కు అధ్యక్ష పదవి..? పైలట్‌కు లైన్ క్లియర్.!
దాదాపు 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. వచ్చె నెల అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహించి, ఆ తర్వాత 19 న కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాజస్తాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పదేపదే కోరారు. ఐతే అందుకు ఆశోక్ గెహ్లాట్ సిద్దంగా లేరని సమాచారం.
కారణం.. ప్రస్తుతం రాజస్తాన్ ముఖ్యమంత్రిగా సచిన్ పైలెట్‌కి అధిష్టానం చాన్స్ ఇస్తుందేమోనన్న టెన్షన్. సచిన్ పైలట్‌కు ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడంపై అశోక్ గెహ్లాట్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఆయన అటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గానూ, రాజస్తాన్ ముఖ్యమంత్రిగానూ రెండు పదవులలోనూ కొనసాగాలన్నదే ఆయన ఆలోచన అని పార్టీ సభ్యుల చెబుతున్నారు. ఇక సచిన్ పైలట్ కూడా ముఖ్యమంత్రి పదవి కోసం చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్షుడైతే.. తనకు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సులున్నాయని ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఆయన సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు.
తొలుత ఆశోక్.. రాహుల్‌ని వర్కింగ్ ఛీప్‌గా ఉండేలా ఒప్పించేందుకు యత్నం చేసిన తదనంతరమే వచ్చే సోమవారం ఈ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్ల సమాచారం. మరోవైపు పార్టీ సీనియర్ నేత శశి థరూర్ కూడా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సోమవారం టెన్ జన్‌పధ్‌లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో సంస్కరణల కోసం కొన్నేళ్లుగా ఒత్తిడి చేస్తున్న జీ-23 సీనియర్ నేతల్లో థరూర్ కూడా ఒకరు. కాంగ్రెస్ ఈ నామినేషన్లను ఈ నెల సెప్టెంబర్ 30 వరకు స్వీకరిస్తుంది. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తే అక్టోబర్ 17 ఎన్నికలు నిర్వహిస్తుంది లేదంటే ఏకగ్రీవంగా ఎన్నుకుంటుంది.