రాజస్తాన్ రగడకు తెర..  విశ్వాస పరీక్ష పాసైన కాంగ్రెస్ - MicTv.in - Telugu News
mictv telugu

రాజస్తాన్ రగడకు తెర..  విశ్వాస పరీక్ష పాసైన కాంగ్రెస్

August 14, 2020

Ashok Gehlot-led Govt Wins Trust Vote in Rajasthan Assembly as MLAs Show off United Front.

దాదాపు నెలరోజులుగా సాగిన రాజస్తాన్ రాజకీయ జగన్నాటకానికి తెరపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షల్లో నెగ్గింది. స్వపక్షంలో తిరుగుబాటు జెండా ఎగరేసిన సచిన్ పైలెట్ దారికి రావడం పరీక్షలో అలవోకగా పాసైంది. తనకు పూర్తి బలముందని ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ తెచ్చిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. కాషాయదళం తన ప్రభుత్వాన్ని కూల్చడానికి చేసిన యత్నాలు విఫలమయ్యాయని సీఎం అశోక్ గెహ్లోత్ మండిపడ్డారు. 

చర్చ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ దుమ్మెత్తి పోసుకున్నాయి. మధ్యప్రదేశ్‌, మణిపూర్‌, గోవాల్లో బీజేపీ ధనం, అధికార బలం ప్రయోగించి ప్రభుత్వాలను కూల్చిందని  మంత్రి శాంతి ధరివాల్‌ ధ్వజమెత్తారు. రాజస్తాన్‌లోనూ అలాగే చేయాలనుకున్నారని ఆరోపించారు. విశ్వాస పరీక్ష సమయంలో సచిన్ విపక్ష సభ్యులకు దగ్గరగా ఎందుకు కూర్చున్నారని బీజేపీ ప్రశ్నించింది. మొంత్తం 200 మంది సభ్యులున్న అసెంబ్లీలో గహ్లోత్‌ సర్కార్‌కు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, బీజేపీకి 72 మంది ఉన్నారు. సీఎం పదవిపై కన్నేసిన సచిన్ పైలెట్‌ను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బుజ్జగించడంతో ఆమె వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలు గెహ్లాత్‌కు మళ్లీ జైకొట్టారు.