ప్రేమించొద్దని ఖురాన్, బైబిల్లో ఉందా? అశ్రీన్.. ఇంటర్వ్యూ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమించొద్దని ఖురాన్, బైబిల్లో ఉందా? అశ్రీన్.. ఇంటర్వ్యూ

May 13, 2022

ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజును సొంత అన్నే హత్య చేయడంతో కుమిలిపోతున్న అశ్రీన్ దుఃఖం మాటలకు అందనిది. కులమతాలు, పరువు పేరుతో సాగుతున్న ఇలాంటి హత్యలు ఇకనైనా ఆగాలని ఆమె కోరుకుంటోంది. వికారాబాద్ జిల్లా మర్పల్లికి చెందిన అశ్రీన్, నాగరాజు ప్రేమ వివాహం చేసుకోవడం, ఆ పెళ్లిని జీర్ణించుకోలేని ఆమె అన్న, బావ కలసి నాగరాజును దారుణంగా హత్య చేయడం తెలిసిందే.

‘ప్రేమించడం తప్పా? ప్రేమించకూడదని ఏ మత గ్రంథం చెబుతోంది? ఖురాన్‌, భగవద్గీత, బైబిల్లో ఉందా?’ అని ఆమె ప్రశ్నిస్తోంది. నాగరాజుతో తన అనుబంధం, ప్రేమ కోసం మతం మార్చుకోడానికి కూడా సిద్ధమైన వైనం, తన ఇంట్లో అనుభవించిన బాధలు, నాగరాజుతో పెళ్లి తర్వాత బెదిరింపులు తదితర విషయాలను ఆమె మైక్ టీవీతో పంచుకుంది. తనను ఒక్క మాట కూడా అనుకుండా ప్రాణప్రదంగా ప్రేమించిన నాగరాజు భవిష్యత్తుపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో వివరించింది. అశ్రీన్ ఆవేదనను ఆమె మాటల్లోనే వినండి..