Ashwani Dutt chalasai retiring from Tollywood movie making
mictv telugu

సినిమాలకు అశ్వనీదత్ గుడ్‌బై.. అదే చివరి మూవీ!

August 12, 2022

Ashwani Dutt chalasai retiring from Tollywood movie making

‘జగదేక వీరుడు, అతిలోక సుందరి’, ‘ఎదురులేని మనిషి’ వంటి అద్భుతమైన చిత్రాలతో అటు మాస్ ప్రేక్షకులను, ఇటు క్లాసిక్ ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలీవుడ్ అగ్ర నిర్మాత అశ్వినీ దత్ సినిమాలకు రైటర్మంట్ ఇవ్వబోతున్నారు. ఆయన తాజా చిత్రం ‘సీతారామం’ సక్సెస్ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఈ సంగతి వెల్లడించారు. తన సినీ కెరియర్‌లో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఓటీటీ వల్ల సినిమాలకు ముప్పేం లేదని, యూట్యూబ్ వల్లే ప్రమాదమని అన్నారు.

‘‘16 లక్షలతో తొలి సినిమా తీశాను. హిందీలో కూడా అల్లు అరవింద్‌తో కలిసి ‘చూడాలని ఉంది’ని రీమేక్ చేశాను. ఆ సినిమా వల్ల బాగా దెబ్బతిన్నాను. 6 కోట్లు నష్టపోయాను. ‘స్టూడెంట్‌ నెంబర్ 1′ మూవీని తొలుత ప్రభాస్‌తో తీద్దామనుకుని తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ను ఎంచుకున్నాం. చిరంజీవితో తీసిన ’జగదేక వీరుడు అతిలోక సుందరి’ నా చిత్రాల్లో పేరెన్నికగన్నది. ఆ మూవీకి పార్ట్ 2 తీసి సినిమాల నుంచి తప్పుకుంటాను’ అని చెప్పారు. అశ్వనీదత్ కూతుళ్లు స్వప్న, ప్రియలు మూవీలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.