Ashwini Vaishnaw shares glimpse of Pamban Bridge, India’s first vertical lift railway sea bridge
mictv telugu

పంబన్ వంతెన త్వరలో ప్రారంభం!

December 29, 2022

ప్రపంచంలోనే అతి భయంకరమైన రైలు ప్రయాణం అంటే పంబన్ బ్రిడ్జి మీదుగా రామేశ్వరం చేరుకోవడమే అంటారు. 108 యేండ్ల చరిత్ర ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో దానికి సమాంతరంగా ఇంకో రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ ని రైల్వే మంత్రి ట్వీట్ చేశారు.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. తమిళనాడులోని రామేశ్వర ద్వీపం, రామనాథపురం జిల్లాలో మండపం మధ్య పంబన్ బ్రిడ్జి నిర్మితమైంది. ఈ వంతెనకు సంబంధించిన యానిమేషన్ వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ఈ 26 సెకన్ల వీడియోలో వంతెన పూర్తయినప్పుడు, దాని కార్యకలాపాలకు సిద్ధంగా ఉన్నప్పుడు ఎలా పని చేస్తుందో చూపిస్తుంది. బుధవారం ఉదయం ట్వీట్ చేసిన చిన్న క్లిప్ ట్విట్టర్లో దాదాపు 300కేకు పైగా వీక్షణలు 24వేలకు పైగా లైకులను సంపాదించింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పంబన్ వంతెన మొదటి నిలువు లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన. ఇది పూర్తయ్యే దశకు చేరుకుంది.

ఘన చరిత్ర..

పంబన్ బ్రిడ్జిని 1914లో నిర్మించారు. అప్పట్లో 20 లక్షల రూపాలయతో నిర్మాణం చేశారు. 2.06కి.మీల పొడవైన వంతెనను 2006‌-07లో మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ కి మార్చారు. ఈ బ్రిడ్జి కింద నుంచి పడవలు, ఓడలు వెళ్లాలంటే 16మంది కార్మికులు పని చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా ఏకంగా ట్రాక్ ఉన్న వంతెనను పూర్తిగా పైకి లిఫ్ట్ చేసేలా అధునాతన సాంకేతికతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 84శాతం పనులు పూర్తికాగా, ట్రాక్ లేటింగ్ పనులు కొనసాగుతున్నాయి. వెర్టికల్ లిఫ్ట్ స్పాన్ గిర్డర్ తయారీ పూర్తవుతునది. ఇటీవల రైల్వే మంత్రిత్వ శాఖకు సమాచారం అందించింది. దీని ప్రకారం.. నిలువు లిఫ్ట్ స్పాన్ కోసం ప్లాట్ ఫారమ్ ను అసెంబ్లింగ్ చేయడానికి సిద్ధమవుతున్నది.
అత్యాధునికంగా..

పాత బ్రిడ్జి కన్నా మరింత అత్యాధునికంగా కొత్త పంబన్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఇక్కడ సముద్రం ఉధృతంగా ఉంటుంది. సుమారు 30 నుంచి 50కి.మీల మేర గాలులు వీస్తాయి. వీటిని తట్టుకునేలా భారీ నిర్మాణం చేపట్టారు. పంబన్ ఛానెల్ కు ఉత్తరం వైపున ఉన్న ప్రసిద్ధ పంబన్ వంతెనకు 27.35మీటర్ల దూరం వద్ద సమాంతరంగా ఉంది. 2020 ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభమై శరవేగంగా జరుగుతున్నాయి. సముద్రం మీదుగా పునర్నిర్మించిన వంతెన మొత్తం పొడవు 2.078కి.మీ.లు. ఈ వంతెన 100 స్పాన్ లను కలిగి ఉంటుంది. పాత వంతెన కంటే 3 మీటర్ల ఎక్కువ పొడవు అన్నమాట. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వెబ్ సైట్ ప్రకారం.. ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 279.63కోట్లు. 72మీటర్ల పొడవు గల నిలువు లిఫ్ట్ స్పాన్ లో 17మీటర్ల వద్ద ఎత్తేందుకు వీలుగా ఉంటుంది. ఫలితంగా కింద నుంచి ఓడలు వెళుతాయి. పైన డబుల్ ట్రాక్ కోసం నిలువు లిప్ట్ స్పాన్ సిద్ధమవుతున్నది.
చాలా సంవత్సరాలుగా పంబన్ వంతెన భారతదేశ ప్రధాన భూభాగం. పంబన్ ద్వీపం మధ్య ఏకైక అనుసంధానంగా ఉంది. దీన్ని రామేశ్వర ద్వీపం అని కూడా పిలుస్తారు. ప్రసిద్ధ పర్యాటక పుణ్యక్షేత్రం అయిన ఈ ప్రదేశంలో 12 జ్యోతిర్లాంగాలలో ఒక లింగం ఇక్కడే ఉంది.

ఇవి కూడా చదవండి : 

చైనాలో ఇండియన్ మందులకు భారీ డిమాండ్..

బుర్జ్ ఖలీఫాను వర్షం నుంచి కాపాడే గొడుగు!

స్వర్గం నుంచి వచ్చిన అమృతం కాఫీ