Ashwini Vaishnaw Shares Pics Of India's 1st Cable-stayed Rail Bridge 'Anji Khad' In J&K
mictv telugu

భారత్ అద్భుతం.. తొలి కేబుల్ బేస్డ్ రైల్వే బ్రిడ్జి

July 8, 2022

భారతదేశంలోనే మొట్టమొదటి తొలి కేబుల్-స్టేయ్‌డ్ రైల్వే బ్రిడ్జి మరి కొన్ని నెలల్లో ప్రారంభానికి సిద్ధమవుతోంది. జమ్మూ కశ్మీర్‌లో అంజి నదికి ఎగువన ఉన్న రియాసి జిల్లాలో ఉన్న ఈ బ్రిడి నిర్మిస్తున్నారు. అంజి ఖాడ్ అనే బ్రిడ్జి జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని కత్రా, రియాసీలను కలుపుతుంది. ఈ అంజి ఖాద్ వంతెన ఓ ఇంజినీరింగ్ అద్భుతం. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్‌లో భాగంగా ఈ నిర్మాణం జరుగుతోంది. ఈ రైల్ లింక్ హిమాలయాల గుండా అత్యంత ఎత్తయిన ప్రాంతంలో నిర్మితమవుతోంది.

జమ్మూ కశ్మీర్‌లో నిర్మాణంలో ఉన్న కేబుల్-స్టేయ్‌డ్ రైల్వే బ్రిడ్జి ప్రస్తుత ఫోటోలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంజి ఖాద్ బ్రిడ్జి కశ్మీరును కలుపుతుందని, దేశంలోనే ఇది తొలి కేబుల్-స్టేయ్‌డ్ రైల్ బ్రిడ్జి అని, భవిష్యత్తు కోసం సిద్ధమవుతోందని పేర్కొన్నారు. ఈ వంతెన పొడవు 473.25 మీటర్లు. నది మట్టానికి 331 మీటర్ల ఎత్తులో, పెను తుపానులను తట్టుకునే విధంగా దీనిని నిర్మిస్తున్నారు. దీనిని 96 కేబుల్స్ సపోర్ట్‌తో నిర్మిస్తారు. నిలువు ఏటవాలుపై సింగిల్ పైలాన్‌ను మాత్రమే నిర్మించడం ఇక్కడ సాధ్యమవుతుంది. చీనాబ్ నదిపై నిర్మించిన వంతెన తరహాలో ఇక్కడ సాధ్యం కాదు. విశిష్టమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలతో దీనిని నిర్మిస్తున్నారు.