మహిళను స్టేషన్‌కే తీసుకొచ్చి ASI రాసలీలలు.. అదే సమయంలో CI రావడంతో..
బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ ఓ ఏఎస్‌ఐ చేయకూడని పనులు చేశాడు. పోలీస్ స్టేషన్‌నే తన బెడ్ రూమ్‌గా మార్చుకుని అడ్డంగా దొరికిపోయాడు. డ్యూటీలో ఉన్న సమయంలో బాగా మద్యం సేవించడమే కాకుండా.. ఏకంగా ఓ మహిళను పోలీస్ స్టేషన్‌కే తీసుకుని వచ్చి రాసలీలలు సలిపాడు. అయితే అదే సమయంలో స్టేషన్‌కు సీఐ రావడం , ఆ ఏఎస్ఐ మహిళతో ఏకాంతంగా గడపడం.. ఆయన కంటపడింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… అనకాపలిజిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్లో అప్పారావు అనే వ్యక్తి ఏ.ఎస్.ఐ.గా పనిచేస్తున్నాడు. తాజాగా మద్యం సేవించిన అప్పారావు.. పోలీస్టేషన్‌లోనే ఓ మహిళతో దుకాణం తెరిచాడు. మద్యం మత్తులో మహిళను స్టేషన్‌కు తీసుకుని వచ్చిన ఏఎస్ఐ.. ఆమెతో కామకలాపాల్లో మునిగిపోయాడు. అదే సమయంలో పీఎస్‌కు వచ్చిన సీఐ.. రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకున్నారు. మహిళను మందలించి వదిలేసి, పోలీసుల పరువు తీసిన అప్పారావుపై చర్యలకు సిఫార్సు చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు కొత్తకోట పోలీసులు నివేదిక పంపారు.