Asia Cup 2022 Schedule: India vs Pakistan on August 28
mictv telugu

ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ పాక్‌తోనే..

August 2, 2022

ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. శ్రీలంక, అఫ్గానిస్థాన్ జట్లు ఆగస్టు 27న ప్రారంభ మ్యాచ్ ఆడనున్నాయి. ఆగస్టు 28న భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తొలి మ్యాచ్లో బరిలోకి దిగనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. తాజా షెడ్యూల్ ఇదే

• ఆగస్ట్ 27 – శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ (దుబాయ్)
• ఆగస్ట్ 28 – భారత్ vs పాకిస్థాన్ (దుబాయ్)
• ఆగస్ట్ 30 బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ (షార్జా)
• ఆగస్ట్ 31 భారత్ vs క్వాలిఫైయర్ (దుబాయ్)
• సెప్టెంబర్ 1 శ్రీలంక vs బంగ్లాదేశ్ (దుబాయ్)
• సెప్టెంబర్ 2 పాకిస్తాన్ vs క్వాలిఫైయర్ (షార్జా)
• సెప్టెంబర్ 3 B1 vs B2 (షార్జా)
• సెప్టెంబర్ 4 A1 vs A2 (దుబాయ్)
• సెప్టెంబర్ 6 A1 vs B1 (దుబాయ్)
• సెప్టెంబర్ 7 A2 vs B2 (దుబాయ్)
• సెప్టెంబర్ 8 A1 vs B2 (దుబాయ్)
• సెప్టెంబర్ 9 B1 vs A2 (దుబాయ్)
• సెప్టెంబర్ 11 ఫైనల్ మ్యాచ్ (దుబాయ్)
అన్ని మ్యాచ్‌లు భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి
వాస్తవానికి 2020లోనే శ్రీలంక వేదికగా ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే కరోనా వల్ల 2022కి వాయిదా పడింది. అయితే తమ దేశంలోతలెత్తిన ఆర్థిక సంక్షోభం వల్ల తాము ఆసియా కప్ ను నిర్వహించలేమని శ్రీలంక క్రికెట్ బోర్డు చేతులెత్తేసింది. దాంతో ఆసియా కప్ ను యూఏఈకి తరలించారు.

ఆసియా కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలతో టీ20 సిరీస్‌లు ఆడబోతోంది టీమిండియా. ఈ టోర్నీలకు సీనియర్లు విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, చాహాల్ కచ్ఛితంగా అందుబాటులో ఉండబోతున్నారని సమచారం. ఆసియా కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసే జట్టునే టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో ఆడించబోతున్నారని, ఆటగాళ్లు గాయపడితే తప్ప భారీ మార్పులు ఉండకపోవచ్చని సమాచారం.