బాక్సర్‌కు కరోనా.. నాతో తలపడు - MicTv.in - Telugu News
mictv telugu

బాక్సర్‌కు కరోనా.. నాతో తలపడు

May 31, 2020

Boxer

నువ్వు ఎవరైతే నాకేంటి అన్నట్టే ఉంది ఇప్పుడు కరోనా పరిస్థితి చూస్తుంటే. ఎవ్వర్నీ వదిలిపెట్టడం లేదు. అవకాశం దొరికినవారికల్లా వ్యాప్తి చెందుతూ తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది. తాజాగా ఆసియా క్రీడల(1998) స్వర్ణ పతక విజేత, 41 ఏళ్ల బాక్సర్‌ డింకో సింగ్‌కు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో మణిపూర్‌లో కరోనా పరీక్ష నిర్వహించారు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన కుటుంబ సభ్యలు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం సింగ్‌ లివర్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, క్యాన్సర్‌ చికిత్స కోసం ఇటీవల ఢిల్లీకి వచ్చి అక్కడే ఉన్నారు. 2400 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి మణిపూర్‌లోని తన ఇంటికి వెళ్లారు. లాక్‌డౌన్‌ కారణంగా రేడియేషన్‌ థెరపీకి దూరమైన డింకోను ఈనెల 25న ఎయిర్‌ అంబులెన్స్‌ సహాయంతో ఢిల్లీకి తీసుకొచ్చారు. కాగా, బాక్సింగ్‌లో విశేష ప్రతిభ కనబర్చిన డింకోకు 2013లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు అందించింది.