కష్టకాలంలోనూ జీతాలు పెంచారు.. మహానుభావులు - MicTv.in - Telugu News
mictv telugu

కష్టకాలంలోనూ జీతాలు పెంచారు.. మహానుభావులు

May 16, 2020

ltkdhj

లాక్‌డౌన్‌తో అన్ని మూతబడిపోయాయి. పనులేవి జరగకపోవడంతో చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని సంస్థలు అయితే అరకొర  జీతాలతో సరిపెడుతున్నాయి. కానీ ఎషియన్ పెయింట్స్ సంస్థ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. కష్ట కాలంలోనూ తమ సిబ్బందికి జీతాలు పెంచి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా హాస్పిటల్ ఖర్చులకు కూడా సాయం అందిస్తామని ప్రకటించింది. దీంతో ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులు తెగ సంబరపడిపోతున్నారు. 

తమ సిబ్బందిలో ఆత్మస్థైర్యం నింపేందుకు తాము వేతనాలు పెంచినట్టు ఆ సంస్థ ప్రకటించింది. దీని కోసం ఆయా డీలర్ల ఖాతాల్లోకి రూ. 40 కోట్లను బదిలీ చేసినట్టు తెలిపారు. వీటితో పాటు బీమాతో, హాస్పిటల్ ఖర్చులకు సాయం అందిస్తామని ఆ సంస్థ సీఈవో అమిత్ సింగ్డే వివరించారు. కాగా ఇప్పటికే కరోనా వైరస్ కట్టడికి కోసం కేంద్ర ప్రభుత్వానికి 35 కోట్లు భారీ విరాళం ఇచ్చారు. దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కూడా కొంత మంది జీతాల్లో కోత పెట్టిన సమయంలో ఎషియన్ పెయింట్స్ చేసిన సాయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.