ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ఫ్యాక్టరీ సిద్ధమైంది. ఫిబ్రవరి 6న కర్నాటకలోని తుమకూరులో హెచ్‌ఏఎల్‌కు చెందిన హెలికాప్టర్ ఫ్యాక్టరీని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తారు. ఇది గ్రీన్‌ఫీల్డ్ హెలికాప్టర్ ఫ్యాక్టరీ. ఇది హెలికాప్టర్ తయారీ సామర్థ్యాన్ని, పర్యావరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వచ్చే 20 ఏళ్లలో 4 లక్షల కోట్ల టర్నోవర్‌తో 1000కు పైగా హెలికాప్టర్లను తయారు చేయనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ఈ తయారీ కేంద్రాన్ని నిర్మించింది.
ప్రతి సంవత్సరం 30 హెలికాప్టర్లు తయారు చేస్తారు:
615 ఎకరాలలో నిర్మించిన ఈ ఫ్యాక్టరీలో మొదట లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను (LUH) ఉత్పత్తి చేస్తుంది. LUH అనేది దేశీయంగా రూపొందించిన, అభివృద్ధి చేసిన 3-టన్నుల తరగతి సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్. ఈ కర్మాగారంలో ప్రతి సంవత్సరం దాదాపు 30 హెలికాప్టర్లను మొదటగా తయారు చేస్తారు. అప్పుడు ప్రతి ఏడాది దాని సామర్థ్యాన్ని 60 నుండి 90 హెలికాప్టర్ల చొప్పున పెంచే ఛాన్స్ ఉందని ఎల్‌యూహెచ్‌ని ఫ్లైట్ టెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
LUH తర్వాత కర్ణాటకలోని 6000 మందికి ఉపాధి :
తేలికపాటి హెలికాప్టర్ (LCH) ఇండియన్ మల్టీరోల్ హెలికాప్టర్ (IMRH) తయారు చేయాలని చేయాలనుకున్నారు. LCH, LUH, సివిల్ ALH IMRH కూడా మరమ్మతులు చేస్తారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా రాష్ట్రంలోని దాదాపు 6000 మందికి ఉపాధి లభిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతే కాకుండా ఫ్యాక్టరీ ప్రారంభంతో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఫిబ్రవరి 6వ తేదీన బెంగుళూరులో ఇండియా ఎనర్జీ వీక్ 2023ని ప్రధాని ప్రారంభిస్తారు. దీని ద్వారా దాదాపు రూ. 4 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది.
ఇవి కూడా చదవండి :
ఆనంద్ మహీంద్రా సపోర్ట్ అదానీలకా? దేశానికా?
ఈ దేశం 95 మిలియన్ల ఉచిత కండోమ్ లను పంపిణీ చేస్తున్నది!