మెహ్రీన్.. ఈ దేశం విడిచి వెళ్లిపో.. - MicTv.in - Telugu News
mictv telugu

మెహ్రీన్.. ఈ దేశం విడిచి వెళ్లిపో..

April 16, 2018

జమ్మూకశ్మీర్‌లో 8 ఏళ్ల అసిఫాపై జరిగిన గ్యాంగ్ రేప్, హత్యపై సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే ఇలా కోరుతున్నవారిపై విమర్శలూ వస్తున్నాయి. దేశంలో అత్యాచారాలు కొత్తేమీ కాదని, దేశం పేరును అనవసరంగా అవమానించకూడదని అంటున్నారు. హీరోయిన్ మెహ్రీన్‌కు కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది.అసిఫా ఉదంతంపై మెహ్రీన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘నేను హిందుస్థానీని.. సిగ్గుపడుతున్నాను.. ఎనిమిదేళ్ల బాలిక.. సామూహిక అత్యాచారం.. హత్య.. ఓ ఆలయంలో..’ అని రాసిన కార్డును పట్టుకుని ఫోటో దిగింది. దాన్ని‘న్యాయం జరగాలి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేసిది. ఈ పోస్ట్‌కు కొందరు మద్దతు పలికారు. కొందరు వ్యతిరేకింది.

భారత దేశంలో పుట్టినందుకు గర్వించాలని, సిగ్గుపడకూడదని ఒకరు అన్నారు..  ‘మెహ్రీన్.. నువ్వు హిందుస్థానీగా ఉండటాన్ని సిగ్గుగా భావిస్తే వెంటనే దేశం విడిచి పెట్టి వెళ్లిపో.. హిందుస్థానీలెగా ఉన్నందుకు మేమైతే చాలా గర్విస్తున్నాం. పిల్లలపై ఇలాంటి దారుణాలు.. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా జరుగుతున్నాయి. వాళ్లు ఎప్పుడూ ఇలా ఓవర్‌ యాక్షన్‌ చేయలేదు..’ అని ట్వీట్ చేశారు. కొందరైతే పాకిస్తాన్ కు వెళ్లిపోవాలని బెదిరించారు. దీనికి మెహరీన్ కూడా ఘాటుగానే స్పందించింది. ‘నీలాంటి వారి కోసమే ఈ పోస్ట్‌ చేశా’ అని జవాబిచ్చింది. కామెంట్లు చేసినవారిలో చాలామంది మెహరీన్‌కు అండగా నిలబడ్డారు. ఇటీవల క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ఆసిఫాపై పోస్ట్ పెట్టి విమర్శలు ఎదుర్కొంది.