రకరకాల కార్లను ఇప్పటివరకు చూశాం. కారు అంటే రోడ్డు మీదనే వెళ్లాలి. కానీ అది ఎగిరితే ఎలా ఉంటుంది? ఇది ఏమైనా సినిమానా అనుకుంటున్నారా? త్వరలోనే ఎగిరే కార్లు రానున్నాయి.
బామ్మ మాట బంగారు బాట సినిమా గుర్తుందా? కారు అలా పైకి ఎగురుకుంటూ వెళుతుంది. ఆ ఆలోచన కొత్తగా అనిపించింది. ఈ ట్రాఫిక్ గోల లేకుండా అలా పైన వెళ్లిపోతే బాగుండు అనిపించింది కదా! అదే అనిపించింది ఒక కంపెనీకి కూడా. అనుకున్నదే తడువుగా తయారు చేసింది. త్వరలో అమెరికాలో ప్రారంభమయ్యే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో (సీఈసీ)లో అస్కా అనే కంపెనీ ఈ తరహా ఎలక్ట్రిక్ కారు ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది.
ఎలా ఉంటుంది?
వివిధ ఆటోమోటివ్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను సీఈసీ షోలో ప్రదర్శిస్తుంటాయి. వీటిలో వోక్స్ వ్యాగన్ తన కొత్త ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ ను ప్రపంచానికి పరిచయం చేయనుంది. వీటితో పాటు అస్కా కారులో నలుగురు ప్రయాణం చేయవచ్చు. ఇది రూడ్లపై కూడా నడుస్తుంది. జనవరి 5 నుంచి 8 వరకు సీఈసీలో ఈ వాహనం నమూనాను ప్రదర్శించనున్నారట. రోడ్డుపై ఎలక్ట్రిక్ కారుగా నడపడంతో పాటు, క్వాడ్ కాప్టర్ గా గాలిలో ఎగుతరుతుంది. అయితే ఈ కారు ఎన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తుందనేది తెలియరాలేదు. తాజా సమాచారం ప్రకారం 2026 వరకు ఈ కారు మార్కెట్ లోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి.
స్పెసిఫికేషన్స్..
విద్యుత్ తో నడిచే ఈ కారులో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. గాలిలో ఎగురుతున్నప్పుడు గంటకు 240 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. రోడ్డుపై 112 కిలోమీటర్ల వరకు వస్తుంది. ట్యూబ్ లెస్ టైర్లు ఉంటాయి. పైగా వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్, షార్ట్ టేకాఫ్ ల్యాండింగ్ టెక్నాలజీలతో నడువడం ఈ కారు ప్రత్యేకం.