mictv telugu

ఆర్సీ అడిగారని.. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను తగలబెట్టాడు..

November 7, 2018

జనం కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నారు. తమను ఎవరూ ఏమీ అనకూడదని బోరవిరుచుకుని తిరుగుతున్నారు. చివరికి పోలీసులు కూడా తమను ఏమీ అడగొద్దంటున్నారు. అడిగితే తిట్లకు లంకించుకోవడమే కాకుండా, దాడులకూ పాల్పడుతున్నారు. మోటార్ బైక్ డాక్యుమెంట్లు అడిగినందుకు ఓ ఆసామి తన ఖరీదైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బండికి నిప్పుపెట్టాడు.

tt

హరియాణాలోని గురుగ్రామ్‌లో మంగళవారం జరిగిందీ ముక్కోపి దహనకాండ. పాలు అమ్ముకునే ఓ మనిషిని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. హెల్మెట్ లేకపోవడంతోబాటు నంబరు ప్లేటు కూడా అనుమానంగా కనిపించడంతో ఆపేశారు. ప్లేటుపై ‘ఓం నమశ్శివాయ..’తోపాటు హెచ్‌ఆర్ 26 జాట్ అనే రాతలు ఉన్నాయి. ఆర్సీ చూపాలని పోలీసులు అడగ్గా, సదరు వాహనచోదకుడు మండిపడ్డాడు. పెట్రోల్ ట్యాంకు వైర్ పీకేసి నిప్పు పెట్టాడు. మంటలు వేగంగా వ్యాపించడంతో అక్కడి వారు పక్కకు తప్పుకున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు వ్యాపారి తప్పించుకుని పారిపోయాడు. పోలీసులు అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Asked for documents, Gurugram man sets bike ablaze, walks off as cops look on incident which happened near DSD College on New Railway Road in Gurugram