రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఎప్పుడు ? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. యుద్ధం ప్రారంభమై ఏడాది కావస్తున్నా రెండు దేశాలు ఇంకా పోరాడుతున్నాయి. ఇప్పటికే యుద్ధానికి ప్రతిఫలంగా వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాలు ఆర్థిక పరంగా చాలా నష్టపోతున్నాయి. సామాన్య పౌరుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. లక్షల మంది ప్రజలు శరణార్థులుగా పొరుగు దేశాలకు వలసపోతున్నారు. అయినా అయినా జెలన్ స్కీ, పుతిన్ వెనుకడుగు వేయడం లేదు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య సంధి కుదిర్చేందుకు అంతర్జాతీయదేశాలు చేసిన సూచనలు, చర్చలు సైతం విఫలమయ్యాయి. ఇంకా పలు దేశాలు పుతిన్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా అమెరికా శ్వేతసౌధ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ ప్రధాని మోదీ తలుచుకుంటే యుద్ధం ఆపొచ్చన్నారు. పుతిన్‌ను మోదీ ఒప్పించగలరని చెప్పుకొచ్చారు. యుద్ధాన్ని ఆపేందుకు మోదీ తీసుకున్నా ఏ చర్యలైనా మాకు అంగీకారమే అంటూ వ్యాఖ్యానించారు. రష్యా సైనిక చర్యను ఆపడంలో పుతిన్‌ను భారత్ ప్రధాని ఒప్పించగలరా అని అడిగిన ఓ ప్రశ్నకు శ్వేతసౌధ ప్రతినిధి జాన్ కెర్బీపై విధంగా సమాధానమిచ్చారు.