ప్రధాని నరేంద్ర మోదీ ఖ్యాతి నోబెల్‌కు చేరిందని, ఈసారి మోదీనే ప్రధాన పోటీదారని గురువారం పెద్ద ఎత్తున మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్‌గా మారింది. భారత్‌లో పర్యటిస్తున్న నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పారని మీడియా సంస్థలు తెలిపాయి. అయితే తాజాగా ఈ అంశానికి సంబంధించి అస్లే టోజే ట్విట్టర్ వేదికగా చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీస్తున్నాయి. నోబెల్ అవార్డుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన పోటీదారు అన్న ప్రచారానికి తెరదించారు.
భారత మీడియా సంస్థల్లో మోదీపై వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అదంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశారు. భారత్ పర్యటనలో ఉన్న అస్లే టోజే తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేసి ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చారు. ” నేను నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్. ఇదంతా ఓ ఫేక్ న్యూస్. దీని గురించి ఎక్కవగా ఎవరూ చర్చించకండి. ఈ విషయంపై మాట్లాడి వార్తను మరింత వైరల్ చేయకండి” అని పేర్కొన్నారు. అస్లే టోజే షేర్ చేసిన ఈ వీడియోను ఫ్యాక్ట్ చెకర్ మహ్మద్ బుబైన్ తన ట్విట్టర్ లో షేర్ చేసి ఏఎన్ఐని ట్యాగ్ చేసి ఈ వీడియోను ఎందుకు పోస్ట్ చేయలేదంటూ ప్రశ్నించాడు. దీంతో నోబెల్ బహుమతి వార్తలకు కళ్లెం పడింది. ఈ పేక్ న్యూస్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్‌లను ప్రచారించకూడదంటూ సూచిస్తున్నారు.