భారత ముస్లింలను గుర్తించే ప్రక్రియకు కేబినెట్ ఆమోదం - MicTv.in - Telugu News
mictv telugu

భారత ముస్లింలను గుర్తించే ప్రక్రియకు కేబినెట్ ఆమోదం

July 6, 2022

అసోంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ ముస్లింలను గుర్తించే ప్రక్రియకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అసోంలో ముస్లిం ఉప సముదాయాలైన గోరియాలు, మోరియాలు, జోలాలు, దేశీలు, సయ్యద్‌లను స్థానిక ముస్లిం తెగలుగా గుర్తించేందుకు ఆమోదం లభించింది. అలాగే పదవ తరగతి ఫస్ట్ క్లాస్‌లో పాసైన విద్యార్ధులకు ఒకేసారి రూ. 16000 స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు కూడా కేబినెట్ ఆమోదించింది. వీటితో పాటు మాజీ సైనికులు, వారి వితంతులకు ఆస్తిపన్ను చెల్లించకుండా మినహాయింపు, పాత వాహనాలను రద్దు చేయడం వంటి నిర్ణయాలు కేబినెట్‌లో తీసుకున్నారు.