Assam boy marries his dead girlfriend
mictv telugu

ఇది కదా ప్రేమంటే..చనిపోయిన ప్రియురాలిని పెళ్లాడిని ప్రియుడు

November 22, 2022

వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే విధి వికటించింది. అనారోగ్యంతో ప్రియురాలు మృతిచెందింది. కానీ ఆమె మరణించాక కూడా ప్రియుడు తన ప్రేమను చాటుకున్నాడు. ప్రియురాలికి ఇచ్చిన మాట ప్రకారం ఆమె మృతదేహానికి తాలి కట్టి వివాహమాడాడు. ఈ విషాదకర ఘటన అస్సాంలో చోటుచేసుకుంది.

మోరిగావ్‌కు చెందిన బిటుపన్ తములి, కౌసువ గ్రామానికి చెందిన 24 ఏళ్ల ప్రార్థనా బోరా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. విషయాన్ని ఇంట్లో కూడి చెప్పి ఒప్పించారు. పెళ్లి కోసం ఊహించుకుంటూ మురిసిపోయారు.అంతా సంతోషం ఉన్నా సమయంలో ఊహించని విధంగా ప్రియురాలు ‘ప్రార్ధన’ అనారోగ్యానికి గురైంది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమె మరణాన్ని ఆపలేకపోయారు. ప్రియురాలి మరణవార్త విని యువకుడు తట్టుకోలేకపోయాడు. ఆమె మృతదేహం వద్ద బోరున విలపించాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆమెను పెళ్లాడాలని నిర్ణయించి..కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నాడు. వారు ఆంగీకరించడంతో ఆమె పార్థీవ దేహానికి సింధూరం పెట్టి బరువెక్కిన గుండెతో తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. జీవితంలో మరెవరిని పెళ్లాడనని ప్రతిజ్ఞ చేసాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో అక్కడున్న వారు షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఇది కదా నిజమైనా ప్రేమ అని కామెంట్లు పెడ్తున్నారు.