మదర్సాలు అక్కర్లేదు, ఖురాన్‌ను ఇళ్లలో చెప్పుకోండి.. సీఎం - MicTv.in - Telugu News
mictv telugu

మదర్సాలు అక్కర్లేదు, ఖురాన్‌ను ఇళ్లలో చెప్పుకోండి.. సీఎం

May 23, 2022

మదర్సాలు, వాటిలో బోధించే ఖురాన్‌పై అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికీ అందుబాటులో ఉండే సాధారణ విద్యా విధానం ఉన్నచోట మదర్సాలు అక్కర్లేదని తేల్చి చెప్పారు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ముస్లింలు వారి పిల్లలకు మత బోధనలు చేస్తున్నారని, ఇలా అయితే వారి హక్కులను హరించడమేనని స్పష్టం చేశారు.

ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఖురాన్ బోధించే మదర్సాలు అక్కర్లేదు. ఇక నుంచి ఈ పదం ఉనికిలో ఉండకూడదు. మీరు ఖురాన్ చెప్పాలనుకుంటే ఇంట్లో చెప్పుకోండి. మీ పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు, టీచర్లు, ప్రొఫెసర్లు, సైంటిస్టులు అవ్వాలంటే సైన్స్, మ్యాథ్స్, బయాలజీ, బోటనీ, జ్యువాలజీ వంటివి చదవాలి. ఈ చదువులు అన్ని పాఠశాలల్లో అందుబాటులో ఉన్నాయి. మీ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత వారికి ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మదర్సాలు తెరవండి’ అని తన అభిప్రాయాలను వెల్లడించారు.