కర్ఫ్యూను ధిక్కరించిన మానవత్వం.. మక్బూల్‌కు సలాం.. - MicTv.in - Telugu News
mictv telugu

కర్ఫ్యూను ధిక్కరించిన మానవత్వం.. మక్బూల్‌కు సలాం..

May 16, 2019

Assam Defying curfew, Muslim man drives auto to take pregnant Hindu woman to hospital.

మతం కన్నా మానవత్వం గొప్పదని నిరూపించాడు ఓ ఆటో డ్రైవర్.  కర్ఫ్యూను ధిక్కరించి ప్రాణాలు లెక్కచేయకుండా దూసుకెళ్లాడు.  అసోంలో మత ఘర్షణల కారణంగా కర్ఫ్యూ విధించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ హిందూ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. అంబులెన్స్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ముస్లిం ఆటో డ్రైవర్ కర్య్వూను లెక్క చేయకుండా ఆమెను తన ఆటోలో ఆస్పత్రికి తీస్కెళ్లి తల్లీ బిడ్డల ప్రాణాలు కాపాడాడు. అతను చేసిని మంచి పనికి సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

అసోంలోని హైలాకండీలో మత ఘర్షణల కారణంగా  కర్ఫ్యూ విధించారు. దీంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు వెళ్లడంలేదు. చాలామంది అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రుబెన్‌ దాస్‌ అనే వ్యక్తి భార్య నందితకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆమె భర్త వెంటనే అంబులెన్స్ కోసం ప్రయత్నించాడు. కానీ అంబులెన్స్ అందుబాటులో లేదు. ఏం చెయ్యాలో తోచక అతను అల్లాడిపోతున్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన మక్బూల్‌.. వెంటనే తన ఆటోలో నందితను ఆస్పత్రికి తీస్కెళ్ళాడు. పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా వున్నారని వైద్యులు తెలిపారు. మక్బూల్ మంచితనాన్ని అభినందించారు.

చుట్టూ ఉన్నవారు మతాల కోసం కొట్టుకుచస్తుంటే మక్బూల్ మాత్రం హిందూ మహిళకు సాయం చేసి మానవత్వాన్ని చాటాడు. కర్య్వూ ఉన్నా పట్టించుకోకుండా ఆమెను సకాలంలో  ఆస్పత్రిలో చేర్చిన మక్బూల్‌ను ఆ ప్రాంత డిప్యూటీ కమిషనర్‌ కీర్తి జల్లీ కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. హిందూ ముస్లింల ఐక్యతను చాటే ఇలాంటి ఉదాహరణలు మరిన్ని వెలుగులోకి రావాలన్నారు. కాగా, మత ఘర్షణల కారణంగా ఒకరు చనిపోగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పలు వాహనాలు, దుకాణాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.