కొత్త పథకం.. పెళ్లికూతురికి తులం బంగారం  - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త పథకం.. పెళ్లికూతురికి తులం బంగారం 

November 20, 2019

government .

వివాహాల నమోదనును ప్రోత్సహించడానికి అస్సాం ప్రభుత్వం ‘బంగారం’ పథకాన్ని ప్రారంభించింది. జనవరి 1 నుంచి అర్హులైన వధువుకు తులం బంగారం ఇస్తామని ఆర్థిక మంత్రి హిమంత బిశ్వాస్ శర్మ ప్రకటించారు. పెళ్లికూతురు కనీసం పదో తరగతి వరకు చదువుకుని ఉండాలని, వధూవరుల వయసు 18, 21గా ఉండి, పెళ్లిని రిజిస్టర్ చేయాల్సి ఉంటుదని వివరించారు. అరుంధతి గోల్క్ స్కీంగా దీనికి పేరు పెట్టారు. 

‘మేమేమీ ఓట్ల కోసం బంగారం ఇవ్వడం లేదు.  బాల్య వివాహాలను అరికట్టి వారి చదువును ప్రోత్సహించేందుకు, పెళ్లిళ్ల రిజిస్టర్లను పెంచడానికి తీసుకొస్తున్నాం. ఈ పథకం వల్ల  సర్కారుపై ఏటా రూ.800 కోట్ల భారం పడుతుంది. రాష్ట్రంలో ఏటా దాదాపు 3 లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నా, కేవలం 60 వేల పెళ్లిళ్లే నమోదు అవుతున్నాయి. తులం బంగారంతో వాటి సంఖ్య 2.5 లక్షలకు చేరుతుందని ఆశిస్తున్నాం.. ’ అని తెలిపారు. 

తులం బంగారాన్ని ప్రభుత్వం నేరుగా ఇవ్వదు. పెళ్లిని నమోదు చేసుకున్నట్లు సర్టిఫికెట్ చూపాక రూ. 30000ను అందిస్తుంది. ఆ సొమ్ముతో బంగారం కొన్నట్లు రసీదు చూపాలి. ఏడాదిలో సగటు ధర లెక్క రూ. 30 వేలు ఇస్తామని, ధరలను బట్టి పథకం కింద ఇచ్చే డబ్బును సవరిస్తుంటామని శర్మ తెలిపారు.