ద్యావుడా..మాస్క్ పెట్టుకునిరా అంటే చేపతో వచ్చాడు - MicTv.in - Telugu News
mictv telugu

ద్యావుడా..మాస్క్ పెట్టుకునిరా అంటే చేపతో వచ్చాడు

May 8, 2020

Assam man brings fish to fight COVID-19

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని డాక్టర్లు, నిపుణులు సూచిస్తున్న సంగతి తెల్సిందే. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాస్క్ ధరించని వాళ్లకు జరిమానా విధిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అస్సాంలోని ఉదల్గురీ పట్టణంలో ఓ వింత సంఘటన జరిగింది. జ్వరంతో బాధపడుతున్న ఓ గ్రామస్తుడు మాస్క్ ధరించకుండా ఓ హెల్త్ సెంటర్‌కు వెళ్లాడు. హెల్త్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న నర్సు మెడికల్ షాప్‌కు వెళ్లి మాస్క్ తెచ్చుకోవాలని సూచిందింది. ఆ వ్యక్తి కొద్ది సేపటి తర్వాత ఒక చేపతో తిరిగి వచ్చాడు. దీంతో ఆ నర్సు షాకైంది. ఎందుకంటే.. అస్సాంలో చేపను ‘మాస్’ అంటారు. ఆ నర్సు అతడిని ‘మాస్క్’ తెచ్చుకోమని చెబితే.. అతడికి ‘మాస్’ అని వినిపించింది. దీంతో అతడు చేపను కొని తెచ్చాడు. అతడి పరిస్థితిని అర్థం చేసుకున్న కొందరు మెడికల్ షాప్‌కు వెళ్లి మాస్క్ కొని తెచ్చారు.