కరోనాపై అబద్ధాలు.. ఎమ్మెల్యే అరెస్ట్  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాపై అబద్ధాలు.. ఎమ్మెల్యే అరెస్ట్ 

April 7, 2020

Assam mla arrested for controversial social media posts on Covid-19

కరోనా వైరస్‌పై అసత్య ప్రచారం చేస్తే జైలు, జరిమానా పడతాయని అని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటూ అస్సాం ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్‌కు చెందిన ఇస్లాం కరోనా ఆస్పత్రులు కాన్సంట్రేషన్ క్యాంపులకంటే దారుణంగా ఉన్నాయని ఆయన విమర్శించాడు. 

‘కరోనా సాకుతో ముస్లింలకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది. ఓ క్వారంటైన్ సెంటర్లో 21 మందిని హత్య చేసే అవకాశముంది. అస్సాంలోని క్వారంటైన్ సెంటర్లలో తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు.. తబ్లిగీ జమాత్ పేరుతో ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా సెంటర్లకు తరలిస్తున్నారు. వారికి కరోనా వైరస్ ఎక్కించి చంపేస్తారు ’ అని ఆయన చెప్పినట్లున్న ఆడియో ఒకటి వైరల్ అయింది. దీంతో పోలీసులు నాగావ్ జిల్లా డింగ్‌లోని ఇస్లాం ఇంటికెళ్లి అతణ్ని అరెస్ట్ చేశారు. కరోనాపై అసత్య ప్రచారం చేస్తే ఎంతటివారినైనా వదిలేదని పోలీసులు హెచ్చరించారు.