కరోనా వైరస్ ఆసుపత్రిగా ఎమ్మెల్యేల అపార్ట్మెంట్ - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా వైరస్ ఆసుపత్రిగా ఎమ్మెల్యేల అపార్ట్మెంట్

July 15, 2020

Assam mlas residency building converted into coronavirus hospital

దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజుకి సగటున 25వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం కనిపిస్తోంది. కరోనా రోగులకు చికిత్స అందించడానికి హాస్పిటల్ సరిపోవడం లేదు. 

ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర రాజధాని ఈటానగర్ లో ఉన్న ఎమ్మెలేల అపార్ట్మెంట్ ను కరోనా వైరస్ ఆసుపత్రిగా మార్చాలని నిర్ణయించారు. ఈమేరకు ఎమ్మెలేలను కూడా ఒప్పించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కిరెన్ రిజిజు ఈరోజు ఉదయం ట్విట్టర్ లో తెలిపారు. ఈ విపత్కర సమయాల్లో మంచి నిర్ణయం తీసుకున్న సీఎం పేమా ఖండును కేంద్రమంత్రి అభినందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పేమా ఖండూ నిర్ణయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.