ప్ర‌భాస్ ఫ‌స్ట్‌లుక్ ను ఇలా వాడుకుంటున్న పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

ప్ర‌భాస్ ఫ‌స్ట్‌లుక్ ను ఇలా వాడుకుంటున్న పోలీసులు

July 11, 2020

 

bcbc

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తన 20వ సినిమా ఫస్ట్‌లుక్ నిన్న రిలీజ్ అయిన సంగతి తెల్సిందే. దీంతో నిన్నటి నుంచి ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే, ప్రభాస్ ఎంతో రొమాంటిక్ గా ఉన్నారు. 

ముందు నుంచీ ఊహించిన అంచనాల‌ను నిజం చేస్తూ “రాధేశ్యామ్” అనే టైటిల్‌నే చిత్ర‌యూనిట్ ఖ‌రారు చేసింది. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాను గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్నాయి. అయితే, ఈ పోస్టర్ ను అసోం పోలీసులు కరోనా వైరస్ పై అవగాహన తీసుకుని రావడానికి వినియోగిస్తున్నారు. ‘రాధే శ్యామ్’ పోస్టర్ ను ఎడిట్ చేసి అందులో ఉన్న ప్రభాస్, పూజలకు మాస్కులు వేశారు. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించండని మెసేజ్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.