అస్సాం ఆస్పత్రిలో మర్కజ్ ‘రోగుల’ వికృతం.. నేలంతా ఉమ్మి..  - MicTv.in - Telugu News
mictv telugu

అస్సాం ఆస్పత్రిలో మర్కజ్ ‘రోగుల’ వికృతం.. నేలంతా ఉమ్మి.. 

April 4, 2020

Assam quarantine patients spits all over floor and windows 

కరోనీ క్వారంటైన్‌లో పేషంట్లు ఎంతో పద్ధతిగా ఉండాలి. తమ ద్వారా మరొకరికి వ్యాధి వ్యాపించకుండా వైద్యసిబ్బంది చెప్పినట్లు నడుచుకోవాలి. కానీ అస్సాంలోని గోలాఘాట్ జిల్లా క్వారంటైన్‌లో రోగులు వికృతంగా ప్రవర్తించారు. నేలంతా ఉమ్మడంతోపాటు గోడెలెక్కి కిటికీల్లోంచి బయటికి ఉమ్మేశారని అధికారులు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత విశ్వశర్మ శుక్రవారం ఆస్పత్రిని సందర్శించడానికి వచ్చేముందు ఈ దారుణం జరిగింది. 

క్వారంటైన్‌లోని 42 మంది ఉన్నారు. వీరికి ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన తబ్లిగీ జమాత్ కు వెళ్లొచ్చిన ద్వారా కరోనా సోకింది. ‘వారు తాము ఆరోగ్యంగా ఉన్నామని భావిస్తున్నారు. కానీ కరోనా రోగులతో డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యారు కాబట్టి పరీక్షలు చేయాల్సి ఉంది. కానీ ఏమాత్రం సహకరించడం లేదు. అన్నిచోట్లూ ఉమ్ముతున్నారు. వారి తల్లిదండ్రులు అలా చేయొద్దని మొత్తుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది..’ అని అక్కడి వైద్యాధికారులు చెప్పారు. ఢిల్లీ, ఘజియాబాద్ క్వారంటైన్లలోనూ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారు ఉమ్మడం, నగ్నంగా తిరగడం, నర్సులను వేధించడం తెలిసిందే.