Assamese flood horror video : The whole train was overturned by the water
mictv telugu

అస్సాం వరదల్లో రైలు బోల్తా… వీడియో

May 17, 2022

Assamese flood horror video : The whole train was overturned by the water

భారీ వర్షాలు, వరదలతో అస్సాంలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో దాదాపు 2 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. రైలు, రోడ్డు వంతెనలు తెగిపోవడంతో రవణా వ్యవస్థంగా పూర్తిగా స్తంభించిపోయింది. పలుచోట్ల కొండచరియలు విరిగి పడి రోడ్డు, రైలు మార్గాలు మూసుకుపోయాయి. రైల్వే లైన్ల పైకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఓ రైలు వరద ప్రవాహానికి బోల్తాపడింది. రైలు బోల్తా పడిందంటే వరద తీవ్రత ఏ విధంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. అదృష్టవశాత్తు రైలు బోల్తా ఘటనలో ప్రయాణికులంతా సేఫ్ గా బయటపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన వీడియో వైరల్ గా మారింది.

గత పది రోజుల్లో దిమా హసావో జిల్లాలో కొండచరియలు విరిగి పడి నలుగురు మృతి చెందారు. మరోవైపు.. అస్సాం, మేఘాలయలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ హెచ్చరికను కొనసాగిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. భారీ వర్షాలు, వరదలతో మణిపూర్‌ కూడా అతలాకుతలం అవుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.