టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం

August 2, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై హత్యకు కుట్ర జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో ఉన్న ఆయన నివాసం వద్ద ఆర్మూర్‌కు చెందిన కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ హత్యకు కుట్రపన్నారు. జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఆయుధాలతో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన నివాసం వద్దకు చేరుకోని, ఆరా తీస్తున్నారు.

ఈ క్రమంలో నిందితుడు ఆర్మూర్‌కు చెందిన మక్లూర్‌ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్‌ భర్తగా పోలీసులు గుర్తించారు. తన భార్య లావణ్యను సర్పంచ్‌ పదవి నుంచి సస్పెండ్‌ చేయడంతో ఆమె భర్త ప్రసాద్‌ గౌడ్‌ ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్నట్లు తెలిపారు. నిందితుడిని బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి కత్తి, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ప్రసాద్‌ గౌడ్‌ భార్య లావణ్యను ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సర్పంచ్ పదవి నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు? అనే విషయాలపై తెగ చర్చ జరుగుతుంది. సర్పంచ్ లావణ్య విషయంలో అధికారులు స్పందించి, ఆమెకు న్యాయం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.