సల్మాన్ ఖాన్‌కు హత్య బెదిరింపు.. భద్రత కట్టుదిట్టం - MicTv.in - Telugu News
mictv telugu

సల్మాన్ ఖాన్‌కు హత్య బెదిరింపు.. భద్రత కట్టుదిట్టం

June 6, 2022

బాలీవుడ్ స్టార్ హీరో, నటుడు సల్మాన్ ఖాన్‌కు, అతని సోదరుడు సలీమ్ ఖాన్‌లకు మహారాష్ట్ర సర్కారు పోలీసు భద్రతను కట్టుదిట్టం చేసింది. ‘పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే సల్మాన్, సలీమ్ ఖాన్‌లకు త్వరలోనే పడుతుంది’ అంటూ తాజాగా గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు సల్మాన్ ఖాన్‌కు లేఖలు పంపించారు. దాంతో విషయం తెలుసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సల్మాన్, సలీమ్ ఖాన్‌లకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తూ, సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సల్మాన్ ఖాన్‌కు పంపిన లేఖలో‘తుమ్హారా మూసే వాలా కర్ దేంగే’ అని రాశారు. అది రాసిన వారు పేరు కానీ, సంతకం కానీ లేవు. సల్మాన్ ఖాన్ రోజూ వాకింగ్ చేసే ప్రాంతంలో బల్లపై కూర్చుంటారు. దానిపైనే ఆగంతకులు లేఖను రాసి అక్కడి పెట్టి వెళ్లారు. వెంటనే సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ గార్డులు మాకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేపట్టాం. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ లోగడ సల్మాన్ విషయంలో హెచ్చరిక చేసినట్లు గుర్తించాం. నేడు సల్మాన్, సలీమ్ ఖాన్‌లకు భద్రత కల్పించాం” అని వెల్లడించారు.