భారతీయ యువకుణ్ని అన్యాయంగా చంపేసిన దుర్మార్గులు
Editor | 27 Jun 2022 5:32 AM GMT
అమెరికాలోని గన్ కల్చర్‌కి మరో భారతీయుడు బలైపోయాడు. కారు పార్క్ చేసి కూర్చున్న వ్యక్తిని దుండగులు వచ్చి కాల్చి చంపేశారు. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వివరాలు.. భారత సంతతికి చెందిన 31 ఏళ్ల సత్నాం సింగ్ అనే వ్యక్తి ఓ suv కారు అద్దెకు తీసుకొని పార్క్ చేసి ఓ వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాడు. అంతలో తుపాకీ పట్టుకొని ఓ వ్యక్తి వచ్చి కాల్పులు జరపడంతో బెల్లెటు తలలోకి దూసుకెళ్లింది. ఛాతీ, మెడ భాగంలో బిగుసుకుపోవడంతో ఆస్పత్రికి తరలించగా, చికిత్స తీసుకుంటూ అక్కడే మరణించాడు. కాగా, హంతకులు ఆ కారు యజమానికి చంపాలనే ఉద్దేశంతో వచ్చారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కారులో కూర్చున్న సత్నాం సింగుని గమనించకుండా కాల్పులు జరిపారని వెల్లడించారు. నిందితులు సిల్వర్ కలర్ వాహనంలో వచ్చి కాల్పులు జరిపినట్టుగా భావిస్తున్నారు.
Updated : 27 Jun 2022 5:32 AM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire