ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి? యూపీలో, పంజాబ్‌లో.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి? యూపీలో, పంజాబ్‌లో..

March 7, 2022

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు ముగిశాయి. పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతున్నాయి. అందరికీ ఆసక్తి రేకెత్తిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో తిరిగి కాషాయ జెండానే ఎగరబోతోందని మెజారిటీ పోల్స్ అంచనా. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని కొన్ని పోల్స్ చెబుతున్నాయి. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్‌లలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నదానిపై స్పష్టత కనిపించడం లేదు.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు యూపీలో బీజేపీ 225 నుంచి 255 స్థానాలు గెలుచుకుంటుందని సీఎన్ఎన్, పీ మార్క్, మ్యాట్రిక్ ఎగ్జిట్ పోల్స్ అంచనా. వంద స్థానాలకుపైగా ఎస్పీ గెలుచుకుంటుందని, బీఎస్పీ మూడో స్థానంలో నిలుస్తందని పోల్స్ చెబుతున్నాయి. పంజాబ్‌లో ఆప్ 70 స్థానాలు గెలుచుకుని తొలిసారి అదికారంలోకి వస్తుందని పీ మార్క్ పేర్కొంది. ఎన్డీటీవీ కూడా ఇదే అంచనా వేసింది. కాంగ్రెస్ రెండో స్థానానికి, అకాళీ మూడో స్థానానికి, బీజేపీ నాలుగో స్థానికి పరిమితమయ్యే అవకాశముందని పలు పోల్స్ అంచనా. గోవాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. బీజేపీ 19 సీట్లు గెలుచుకుని గద్దెనెక్కుతుందని జన్ కీ బాత్ అంచనా.
ఉత్తరాఖండ్‌లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న పలు పోల్స్ చెబుతున్నాయి. బీజేపీకి 37, కాంగ్రెస్ కు 31 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ పోల్ తెలిపింది.
మణిపూర్‌లో బీజేపీ 25 సీట్లను కైవసం చేసుకునే అవకాశముందని, కాంగ్రెస్‌కు 14 సీట్లు దక్కొంచని జన్ కీ బాత్ అంచనా.